తెలంగాణ వ్యవసాయ శాఖ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి సింగిరెడ్డి...
హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ శాఖ నూతన క్యాలెండర్ ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ శాఖ నూతన క్యాలెండర్ ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రుల సముదాయంలోని మంత్రి నివాసానికి వెళ్లిన వ్యవసాయ శాఖ అధికారులు మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి చేతులమీదుగా 2023 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను విడుదలచేసారు. మంత్రిని కలిసిన వారిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి వున్నారు.