పెద్దపల్లి జడ్పి ఛైర్మన్ పుట్టా మధుపై తీవ్ర ఆరోపణలు... సింగరేణి లారీ ఓనర్ల ఆందోళన

పెద్దపల్లి :  సింగరేణి బొగ్గును తరలించే లారీల యజమానులు, డ్రైవర్లు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆందోళన చేపట్టారు.

First Published Sep 28, 2022, 3:31 PM IST | Last Updated Sep 28, 2022, 3:31 PM IST

పెద్దపల్లి :  సింగరేణి బొగ్గును తరలించే లారీల యజమానులు, డ్రైవర్లు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆందోళన చేపట్టారు. అధికార అండతో సింగరేణి బొగ్గును తరలించే తమ లారీలను పెద్దపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ పుట్టా మధుకర్ అడ్డుకుంటున్నారని లారీ యజమానులు ఆరోపించారు. ఇలా తమ లారీల స్థానంలో తన సొంత నియోజకవర్గం మంథనికి చెందినవారి లారీలను సింగరేణి బొగ్గు రవాణాకు ఉపయోగిస్తున్నారని ఆందోళనకు దిగిన లారీ ఓనర్లు ఆరోపించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలుగచేసుకుని పుట్టా మధు దౌర్జన్యాన్ని అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానులు గోదావరిఖనిలో రాస్తారోకో చేపట్టారు. దాదాపు 800వందల లారీల యజమానులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. గోదావరిఖని ఫ్లైఓవర్ వద్ద రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.