సింధూ శర్మ ఆపరేషన్ చబుత్రా: అర్థరాత్రి రోడ్లపై....
అర్ధరాత్రి పూట తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా బయటకు పంపకూడదని మెటుపల్లి సిఐ శ్రీనివాస్ అన్నారు.
అర్ధరాత్రి పూట తల్లిదండ్రులు తమ పిల్లలను అనవసరంగా బయటకు పంపకూడదని మెటుపల్లి సిఐ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేరకు ఆపరేషన్ చబుత్ర కార్యక్రమం నిర్వహించారు. అర్థరాత్రి పూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న సుమారు 40 మంది యువకులను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.అత్యవసరం అయితే తప్ప బయట తిరగకూడదని హెచ్చరించారు.ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అర్థరాత్రి సమయంలో బయటకు పంపకూడదు అని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీఐ అన్నారు.