ఆషాఢం బోనాల ప్రత్యేకత ఇది..
ఆషాడమాసాన్ని హైదరాబాద్ లో బోనాల మాసంగా కూడా పరిగణిస్తారు.
ఆషాడమాసాన్ని హైదరాబాద్ లో బోనాల మాసంగా కూడా పరిగణిస్తారు. నెలపొడవునా జరిగే బోనాలతో జంటనగరాలు పులకిస్తాయి. పల్లెపదాలతో ఆటపాటలతో డప్పు వాయిద్యాల మోతలు, జానపదాల పాటలతో హోరెత్తిపోతాయి. బోనాలు తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ప్రతీకలు. బోనాలకు ఆషాడమాసానికి సంబంధం ఉంది. ఆషాడం తొలకరికి పుట్టినిల్లు.. తొలకరితో పాటూ వ్యాధులనూ మోసుకొస్తుంది ఈ మాసం. ఆ రోగాలను నిర్మూలించి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తే అమ్మతల్లి. ఈ అమ్మతల్లులే గ్రామ దేవతలు. గ్రామ దేవతలంతా స్త్రీ మూర్తులే. ఇది ఆదిమ సమాజం స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీకలు. ప్రబలే అంటువ్యాధులు, ముంచెత్తే వరదల నుండి తమని తమ పిల్లలను కాపాడమంటూ ఈ అమ్మతల్లులైన గ్రామ దేవతలకు జరిపే శాంతే బోనాలు.