ఆకలితో అలమటిస్తూ రోడ్డెక్కిన అమ్మాయిలు... శాతవాహన యూనివర్సిటీలో ఇదీ దుస్థితి..!
కరీంనగర్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా తెలంగాణలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సమస్యలపై చర్చ మొదలయ్యింది.
కరీంనగర్ : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనతో ఒక్కసారిగా తెలంగాణలోని ప్రముఖ యూనివర్సిటీల్లో సమస్యలపై చర్చ మొదలయ్యింది. ఈ సమయంలో కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు గత 15రోజులుగా ఆకలితో అలమటిస్తున్నామంటూ ఖాళీ ప్లేట్లతో రోడ్డెక్కారు. క్యాంపస్ లో బీఫార్మసీ కాలేజీ స్టూడెంట్స్ భోజనం సరిగ్గా పెట్టడంలేదని ఆందోళనకు దిగారు. కాలేజీ క్యాంపస్ నుండి దాదాపు 150 మంది విద్యార్థులు ఖాళీ ప్లేట్లను వాయిస్తూ యూనివర్సిటీ మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు యూనివర్సిటీ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.