జగిత్యాల జిల్లాలో అమానుషం... మూడేళ్ల చిన్నారిపై వృద్దుడి అత్యాచారయత్నం

జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన అనుపురపు శ్రీనివాస్ గౌడ్ (50) అనే వ్యక్తి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తన కూతురితో శ్రీనివాస్ గౌడ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధించాడంటూ బాధిత చిన్నారి తల్లి బుధవారం జగిత్యాల జిల్లా ఎస్పి కార్యాలయంలో పిర్యాదు చేయడంతో ఈ అమానుషం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి పండగరోజే తమ కూతురిపై అత్యాచారయత్నం జరగ్గా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసామని... అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీని కలిసినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు తెలిపారు.   పోలీసులు పట్టించుకోకపోవడంతో నిందితుడితో పాటు అతడి బంధువులు, కుటుంబీకులు రెచ్చిపోతున్నారని... మా అంతు చూస్తామంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పెట్టవద్దని... పిర్యాదు వాపస్ తీసుకోవాలని ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు ప్రాణ భయం ఉందని... న్యాయం చేసి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పి కార్యాలయంలో పిర్యాదు చేసినట్లు బాధిత తల్లిదండ్రులు పేర్కొన్నారు.

First Published Jan 19, 2022, 5:33 PM IST | Last Updated Jan 19, 2022, 5:33 PM IST