Asianet News TeluguAsianet News Telugu

వినాయక మండపాలు వద్దనడం హిందూవ్యతిరేకం కాదు.. తెలంగాణ అర్చక సంఘాలు

కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని తెలంగాణ  అర్చక సంఘాలు పిలుపునిచ్చాయి. 

కరోనా పరిస్థితుల్లో ఇంట్లోనే వినాయక చవితి పూజలు నిర్వహించుకోవాలని తెలంగాణ  అర్చక సంఘాలు పిలుపునిచ్చాయి. వినాయకమండపాలు వద్దనడం హిందూ వ్యతిరేకం కాదని, కరోనా కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అర్చక, ఉద్యోగ సంఘాల అధ్యక్షులు చెబుతున్నారు. కరోనా కారణంగా అన్ని మతాలు కూడా పండగ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాయని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.