కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ
కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా వి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా వి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం రామగుండం పోలీస్ కమీషనర్ గా పనిచేసిన సత్యనారాయణను హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కరీంనగర్ కు బదిలీ చేశారు. ఇంతకాలం కరీంనగర్ సిపిగా పనిచేసిన కమలాసన్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ గత మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కమలాసన్ రెడ్డి బదిలీ వ్యవహారం పోలీస్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.