ఎమ్మెల్యేతో ప్రాణహాని.. మాజీ సర్పంచ్ ఫిర్యాదు..
అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి ప్రాణాలు తీయాలని చూస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సి ఐ వల్ల తనకు ప్రాణహాని ఉందని గుమ్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ముస్కు వెంకట్ రెడ్డి కరీంనగర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి ప్రాణాలు తీయాలని చూస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సి ఐ వల్ల తనకు ప్రాణహాని ఉందని గుమ్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ముస్కు వెంకట్ రెడ్డి కరీంనగర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు వేలం పాట ద్వారా ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని అతను అమ్మితే తాను కొనుగోలు చేశానని దీంతో ఆ భూమి తనకు ఇవ్వాలంటూ.. తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులో ఇరికించారన్నారు. ఇదివరకు తనపై దాడికూడా చేయించారని చెప్పుకొచ్చాడు. తక్షణమే ఎమ్మెల్యేపై, సీఐపై ఎంక్వయిరీ చేసి తనకు న్యాయం చేయాలని కోరారు.