గ్రామాన్ని వీడాలంటూ సర్పంచ్ భర్త హుకుం.. కలెక్టర్ కు వలస కుటుంబాల గోడు

జగిత్యాల :  సర్పంచ్ భర్త నియంతలా వ్యవహరిస్తూ తమను గ్రామంవిడిచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసాడని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములగుర్తి గ్రామంలో నివాసముంటున్న వలస కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

First Published Feb 22, 2023, 1:03 PM IST | Last Updated Feb 22, 2023, 1:03 PM IST

జగిత్యాల :  సర్పంచ్ భర్త నియంతలా వ్యవహరిస్తూ తమను గ్రామంవిడిచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసాడని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములగుర్తి గ్రామంలో నివాసముంటున్న వలస కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాలుగున్నర దశాబ్దాల కింద ఎక్కడెక్కడినుండో వలసవచ్చిన ఆదివాసీలు, రజకులు వేములగుర్తిలో స్థిరపడ్డారు. కాయాకష్టం చేసి సొంత ఇళ్లు, వ్యవసాయ భూములు కొనుక్కుని హాయిగా జీవిస్తున్నారు. అయితే వీరిని టార్గెట్ చేసిన వేములగుర్తి సర్పంచ్ భర్త... వెంటనే ఇళ్లు, భూములు అమ్ముకుని తమ గ్రామం నుండి వెళ్లిపోవాలని ఆదేశించాడని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేసాయి. సర్పంచ్ భర్త వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించాయి.