తెలంగాణకు తొలి మహిళా సీఎస్... సీఎం కేసీఆర్ ను కలిసిన శాంతి కుమారి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారిని శాంతి కుమారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. 

First Published Jan 11, 2023, 4:11 PM IST | Last Updated Jan 11, 2023, 4:11 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారిని శాంతి కుమారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసారు. నూతన సీఎస్ గా నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే శాంతికుమారి ప్రగతిభవన్ కు చేరుకున్నారు. తనకు చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు శాంతికుమారి కృతజ్ఞతలు తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యత స్వీకరించారు.