నేరెళ్ళ బాధితుడి ఇంటిపైకి దూసుకెళ్లిన ఇసుక లారీ


రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఓ కుటుంబం పెను ప్రమాదం నుండి బయటపడింది. 

First Published Mar 29, 2021, 1:57 PM IST | Last Updated Mar 29, 2021, 1:57 PM IST


రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో ఓ కుటుంబం పెను ప్రమాదం నుండి బయటపడింది. నేరెళ్ళ బాధితుడు కోల హరీష్ ఇంట్లోకి తెల్లవారుజామున ఓ ఇసుక లారీ దూసుకెళ్లింది. అయితే ఓ బండరాయి అడ్డుగా వుండటంతో లారీ ఆగిపోవడంతో హరీష్ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో హరీష్ కుటుంబంమొత్తం ఇంట్లోనే వుంది. బండరాయి అడ్డుగా లేకుంటే లారీ ఇంట్లోకి దూసుకువచ్చి ఘోరం జరిగేదని తెలుస్తోంది.  బాధితుడికి మద్దతుగా మరియు ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బాధితుడికి మద్దతుగా బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు