సాయిచంద్ కుర్చీలో రజనీ... గిడ్డంగుల కార్పోరేషన్ బాధ్యతలు స్వీకరిస్తూ భావోద్వేగం

హైదరాబాద్: బిఆర్ఎస్ నాయకుడు వేద సాయిచంద్ అకాల మరణంతో ఆయన భార్య రజనిని తెలంగాణ గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా కేసీఆర్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 

Share this Video

హైదరాబాద్: బిఆర్ఎస్ నాయకుడు వేద సాయిచంద్ అకాల మరణంతో ఆయన భార్య రజనిని తెలంగాణ గిడ్డంగుల కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా కేసీఆర్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రజనీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం భావోద్వేగంగా సాగింది. భర్త సాయిచంద్ ఫోటోకు పుష్పాంజలి ఘటిస్తూ రజని భావోద్వేగానికి గురయ్యారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి తదితరులు బాధ్యతలు చేపట్టిన రజనికి శుభాకాంక్షలు తెలిపి ధైర్యంగా వుండాలని సూచించారు. 

Related Video