కరీంనగర్ లో నిలిచి పోయిన ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు...
కరీంనగర్ : ఆర్టీసీ అధికారులు బస్సుల యజమాన్యంతో కలిసి తమను అకారణంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్లు కరీంనగర్ బస్టాండ్లో ఆందోళన దిగారు.
కరీంనగర్ : ఆర్టీసీ అధికారులు బస్సుల యజమాన్యంతో కలిసి తమను అకారణంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ ప్రైవేటు డ్రైవర్లు కరీంనగర్ బస్టాండ్లో ఆందోళన దిగారు. దీంతో కరీంనగర్ వన్ డిపో టు డిపో కు సంబంధించిన 96 బస్సుల సేవలు నిలిచిపోయాయి. బస్సులు లేకపోవడంతో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను అకారణంగా విధుల నుండి తొలగిస్తూ.. కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల సంఘం స్పష్టం చేసింది.