జడ్చర్లలో ఘోర ప్రమాదం... 34మందితో వెళుతుండగా ఆర్టిసి బస్సులో మంటలు

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. 

First Published Jun 27, 2022, 2:48 PM IST | Last Updated Jun 27, 2022, 2:48 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగారు. ఈ మంటలు అంతకంతకు పెరిగి అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్దమైంది. అర్ధరాత్రి బస్సులోని ప్రయాణికులంతా పడుకున్నాక మంటలు చెలరేగగా డ్రైవర్ అప్రమత్తతో అందరి ప్రాణాలు దక్కాయి. 44వ నెంబర్ జాతీయ రహదారిపై జడ్చర్ల సమీపంలో బస్సులోంచి పొగలు గమనించిన డ్రైవర్ 34 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బిబి నగర్ లో పోలీస్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. కొండమడుగు వద్ద వేగంగా వెళుతున్న పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. అయితే వాహనంలో ప్రయాణిస్తున్నవారికి గాయాలయ్యాయి. పోలీస్ వాహనంలో ప్యాసింజర్లను తీసుకుని వెళుతున్నట్లుగా సమాచారం.