ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ తీగలే టార్గెట్ ... ఘరానా దొంగల ముఠా అరెస్ట్

పెద్దపల్లి :విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు వారి కంట పడ్డాయంటే మాయం కావాల్సిందే.

First Published Mar 5, 2023, 10:58 AM IST | Last Updated Mar 5, 2023, 10:58 AM IST

పెద్దపల్లి :విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు వారి కంట పడ్డాయంటే మాయం కావాల్సిందే. ఇప్పటివరకు మూడు జిల్లాలో ఏకంగా 67 ట్రాన్స్ ఫార్మర్ల చోరీకి పాల్పడిన దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. దొంగల అరెస్ట్ కు సంబంధించిన వివరాలను పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన తొమ్మిదిమంది ఓ ముఠాగా ఏర్పడి ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ తీగల దొంగతనానికి  పాల్పడుతున్నారు.కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిదిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా తాజాగా మంథని సమీపంలో పట్టుబడింది.రెండు టాటా ఏస్ వాహనాల్లో కాపర్ తీగలను తరలిస్తున్న దొంగల ముఠాను ఎగ్లాస్పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 9మందిని అరెస్ట్ చేయగా వీరిలో ఇద్దరు మైనర్లు కూడా వున్నారు. ఈ దొంగల ముఠా సభ్యుల్లో కొందరిపై ఇప్పటికే కేసులు వున్నాయని... అవసరమయితే ఈ ముఠా సభ్యులందరిపై పీడి యాక్ట్  నమోదు చేస్తామని పోలీసుల తెలిపారు.