యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం... నలుగురికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని రాయగిరి సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయానిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు.