పొలాల్లోకి దూసుకెళ్లిన ఎస్సై వాహనం... తృటిలో తప్పిన ప్రమాదం


పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

First Published Jun 27, 2021, 10:03 AM IST | Last Updated Jun 27, 2021, 10:03 AM IST


పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహాముత్తారం ఎస్సై గడ్డం శ్రీనివాస్ వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. అయితే ఆయనకు తృటిలో  ప్రమాదం తప్పింది. చిన్న చిన్న గాయాలతో ఎస్సై బయటపడ్డాడు. ఆయనను చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.