హైదరాబాద్ శివారులో ప్రమాదం... అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ

హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

First Published Dec 17, 2020, 11:01 AM IST | Last Updated Dec 17, 2020, 11:01 AM IST

హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్ తొండుపల్లి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ సంబంవించలేదు. లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. లారీ రోడ్డుపైనే బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కర్నూల్ నుండి హైద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.