RTC strike video : ప్రగతిభవన్ ను ముట్టడించిన రేవంత్ రెడ్డి అరెస్ట్
మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిన్నటి నుంచి పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ప్రగతిభవన్ ముట్టడి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి రేవంత్ రెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు బైక్ పై వచ్చారు. రేవంత్ రెడ్డిని గమనించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా ప్రగతిభవన్ గేటును తాకుతానని చెప్పిన రేవంత్ రెడ్డి అన్నట్లుగానే ప్రగతిభవన్ గేటను తాకారు.