Asianet News TeluguAsianet News Telugu

రెమిడిసివిర్ అక్రమ దందా... ప్రైవేట్ హాస్పిటల్స్ మంత్రి గంగుల వార్నింగ్

కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల పర్యవేక్షణకు కలెక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.  

కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల పర్యవేక్షణకు కలెక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.  కరోనా పేషంట్లకు ప్రైవేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని మంత్రి కోరారు. ఏ ఆస్పత్రి ఎంత రేమిడిసివిర్ తీసుకుంది... పేషంట్ కు ఇచ్చారా లేక బ్లాక్ చేశారా తెలుసుకునేందుకు ఓ టీమ్  ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

''ప్రైవేట్ ఆసుపత్రులు మినిమం ప్రైస్ తో రెమిడేసివిర్ ఇంజక్షన్ పేషెంట్లకు ఇవ్వాలి. జిల్లాలో రోజుకు సరిపడా రేమిడేసివిర్ కోసం మంత్రి ఈటెల రాజేందర్ తో మాట్లాడా. రేమిడేసివిర్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  ఒక్కొక్క రేమిడేసివిర్ ఇంజక్షన్ 20 వేలకు అమ్ముతున్నట్లు మాకు ఫిర్యాదులు వచ్చాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు'' అని మంత్రి గంగుల సూచించారు. 

Video Top Stories