పెద్దపల్లిలో వింత సంఘటన... జూనియర్ కాలేజీ ప్రాంగణంలో వందలాది పసుపు కప్పల సందడి
పెద్దపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుుకుంది.
పెద్దపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుుకుంది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నీరు నిలిచింది. ఈ నీటిలో వందలాదిగా లేత పసుపు రంగు కప్పలు చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నడూ లేనివిధంగా వందలాది కప్పులు గాండ్రు గాండ్రు మంటూ శబ్దాలు చేస్తూ నీటిలో గెంతులాడటం చూసి పెద్దపల్లి వాసలు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.