సింగరేణి మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించడం హర్షణీయం
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఏడు సీట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఏడు సీట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇటీవల అమెరికా పర్యటన నేపథ్యంలో ఐటీ పార్కు ఏర్పాటుకు సహకరిస్తామని ప్రవాస భారతీయులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ వ్యతిరేక, ఇబ్బందికర కార్యక్రమాలు చేపడితే క్రమశిక్షణ కమిటీ ద్వారా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Singareni medical collage ra