గర్భిణి కోసం ట్రయిన్ ను అత్యవసరంగా నిలిపి ...రైల్వే సిబ్బంది మానవత్వం

పెద్దపల్లి : పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి కోసం రైలును అర్దాంతరంగా నిలిపి మానవత్వాన్ని చాటుకున్నారు రైల్వే సిబ్బంది. 

First Published Oct 30, 2022, 11:25 AM IST | Last Updated Oct 30, 2022, 11:25 AM IST

పెద్దపల్లి : పురిటినొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి కోసం రైలును అర్దాంతరంగా నిలిపి మానవత్వాన్ని చాటుకున్నారు రైల్వే సిబ్బంది. మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగినా ఓ తల్లీ బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు రైల్వే సిబ్బంది తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలేవుందని తెలియజేసే ఈ సంఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  

బెంగళూరు నుండి బనారస్ వెళుతున్న యశ్వంత్ పూర్ స్పెషల్ ట్రయిన్ లో నిండుగర్భిణి అనితాదేవి, సోదరుడు వినయ్ కుమార్ తో కలిసి ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారమివ్వగా పెద్దపల్లిలో రైలును అత్యవసరంగా నిలిపివేసారు. అప్పటికే అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ లో గర్భిణిని తరలించారు. పురిటినొప్పులు ఎక్కువ కావడంతో మహిళ అంబులెన్స్ లోనే ప్రసవించింది. తల్లీ బిడ్డ ఇద్దరూ సురక్షితంగానే వున్నారని... వారిని పెద్దపల్లి మాతాశిశు హాస్పిటల్ కు తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.