ఖబర్దార్... ఆ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: రాచకొండ సిపి వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణలో రోజుకు 3వేలకు పైగా కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వుండాలని రాజకొండ కమీషనర్ మహేష్ భగవత్ సూచించారు.
హైదరాబాద్: తెలంగాణలో రోజుకు 3వేలకు పైగా కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వుండాలని రాజకొండ కమీషనర్ మహేష్ భగవత్ సూచించారు. తప్పనిసరిగా మాస్కు ధరించే బయటకు రావాలన్నారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నామని... నిన్న(బుధవారం) ఒక్కరోజే కమీషనరేట్ పరిదిలో 832 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సిసి కెమెరాల ద్వారా మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపైకి వస్తున్నవారిని గుర్తిస్తున్నామని... ఇలా నిర్లక్యంగా బయటకు వచ్చేవారు ఖబర్దార్ అని సిపి హెచ్చరించారు. ఈ క్లిష్ట సమయంలో చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.