KCR Sircilla Visit : కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ సమీపంలోకి రాగానే మిడ్ మానేరు భూనిర్వాసితులు సీఎం కాన్వాయ్ కి అడ్డంగా వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తీసుకున్న భూములకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని, తామెలా బతకాలని ఆవేదన వ్యక్త చేశారు. రెండు వైపుల నుండి కాన్వాయ్ మీదికి దూసుకొచ్చిన వీరిని పోలీసులు వెంటనే పక్కకు తప్పించారు.