కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడి ప్రాణాలు కాపాడి... మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

కరీంనగర్: ప్రమాదానికి గురయి ప్రాణాపాయస్థితిలో వున్న ఓ యువకున్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు పోలీస్ కానిస్టేబుల్.

First Published Jun 23, 2021, 1:18 PM IST | Last Updated Jun 23, 2021, 1:18 PM IST

కరీంనగర్: ప్రమాదానికి గురయి ప్రాణాపాయస్థితిలో వున్న ఓ యువకున్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు పోలీస్ కానిస్టేబుల్. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడికి రోడ్డుపైనే ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఏరియాలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డుపైనే యువకుడు కుప్పకూలిపోయి దాదాపు ఊపిరి ఆగిపోయింది. అయితే అక్కడే విధుల్లో వున్న కానిస్టేబుల్ ఖలీల్ వెంటనే యువకుడి ఛాతిపై ఒత్తుతూ గుండె ఆగకుండా చూశాడు. ఇలా కొంతసేపు పంపింగ్ చేయడంతో యువకుడి గుండె తిరిగి కొట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు.