Asianet News TeluguAsianet News Telugu

అద్భుత ఆవిష్కరణ... డ్రోన్ సాయంతో వరిపంటకు ఎరువుల స్ప్రే

కరీంనగర్: జమ్మికుంట పట్టణంలో కె.వి.కె లో చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డ్రోన్ సహాయంతో వరి పొలంలో రసాయనిక ఎరువులను స్ప్రే చేసే టెస్ట్ ట్రయల్ జరిగింది. 

కరీంనగర్: జమ్మికుంట పట్టణంలో కె.వి.కె లో చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డ్రోన్ సహాయంతో వరి పొలంలో రసాయనిక ఎరువులను స్ప్రే చేసే టెస్ట్ ట్రయల్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సదరు కంపనీ ప్రతినిధులను అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  ప్రపంచంలో ఎక్కడ కొత్తగా ఆవిష్కరణలు జరిగినా, టెక్నాలజీ వచ్చిన కూడా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి ఎలా తగ్గించాలో, పంటల దిగుబడి ఎలా పెంచుకోవాలో రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  రైతాంగానికి, వ్యవసాయానికి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తుందన్నారు. నీళ్లు, కరెంటు, పెట్టుబడి డబ్బులు ఇవ్వడంతో పాటు పంటలు కొనే ప్రయత్నం చేస్తోందన్నారు. రాబోయే కాలంలో దేశానికి ఒక రోల్ మోడల్ గా, ఆదర్శవంత రాష్ట్రం గా తెలంగాణ నిలిచే ఆస్కారం ఉందని ఈటల పేర్కొన్నారు.