మంథనిలో ఏకంగా డబుల్ బెడ్రూం ఇళ్లే కబ్జా... లబోదిబోమంటున్న లబ్దిదారులు
మంథని: కేసీఆర్ సర్కార్ తెలంగాణలో గూడులేని నిరుపేదల సొంతింటికలను నిజం చేయడానికి భారీగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే చాలాచోట్ల ఇళ్లు తక్కువగా లబ్దిదారులు ఎక్కువగా వుండటంతో నిర్మాణం పూర్తయినా పంపిణీ జరగడంలేదు. ఇలా పెద్దపల్లి జిల్లా మంథనిలో కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయి నాలుగేళ్ళయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో కొందరు లబ్దిదారులతో పాటు అనర్హులు సైతం తమకు నచ్చిన ఇళ్లను ఆక్రమించుకుని గృహప్రవేశం కూడా చేసారు. మొత్తం 96ఇళ్లు నిర్మించగా అన్నీ ఆక్రమణకు గురయ్యాయి. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఇలా ప్రభుత్వం నిర్మించిన ఇండ్ల ఆక్రమణ రాజకీయ దుమారం రేపుతోంది.