నేటినుండి పరుగులు పెడుతున్న ప్యాసింజర్ రైళ్లు.. సందడిగా మారిన రైల్వే స్టేషన్లు..

లాక్ డౌన్ కారణంగా ఆగిన రెగ్యులర్ రైళ్ల ప్రయాణం మల్లి మొదలైంది. 

First Published Jun 1, 2020, 5:09 PM IST | Last Updated Jun 1, 2020, 5:09 PM IST

లాక్ డౌన్ కారణంగా ఆగిన రెగ్యులర్ రైళ్ల ప్రయాణం మల్లి మొదలైంది. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో సందడిగా మారింది. తొలిరోజు 200 రైళ్లు రాకపోకలు సాగించే విధంగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. కరోనా కట్టడిలో భాగంగా కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది ప్రభుత్వం. ప్రయాణ సమయానికి 90 నిమిషాల ముందే  ప్రయాణికులు స్టేషన్ చేరుకోవాలి. స్టేషన్ లో సామజిక దూరం పాటించేలా నేలపై గుర్తులు ఏర్పాటు చేసారు. ప్రతి ప్రయాణికుడికి ధర్మల్ స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలు చేస్తారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేరు వేరుగా ఉంచి  శానిటైజర్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. టికెట్ తో పాటు మాస్కు ఉన్నవారికే స్టేషన్ లో కి అనుమతి ఉంటుంది. తోలి రోజు 1 .45 లక్షల మంది రిజర్వేషన్ చేసుకున్నారు. జూన్ 1  నుండి నెలాఖరు వరకు దాదాపు 25 లక్షల మంది రిజర్వేషన్లు చేసుకున్నారు. జూన్ 29 నుండి తత్కాల్ బుకింగ్ కూడా ప్రారంభ మవుతాయి.