దారుణం.. కరోనా పేషంట్ ను ఇంట్లోకి రానివ్వని యజమాని.. రోడ్డు మీదే బాధితుడు..

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. 

First Published Jul 29, 2020, 4:35 PM IST | Last Updated Jul 29, 2020, 4:35 PM IST

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ బెడ్ లు ఖాళీ లేకపోవడం, లక్షణాలు అంతగా లేకపోవడంతో బాధితుడిని హోం క్వారంటైన్ లో ఉండాలని తిరిగి ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన అతనికి చేదు అనుభవం ఎదురయ్యింది.  అంబులెన్సులో వచ్చిన బాధితుడిని ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బాధితుడు అంబులెన్స్ లోనే ఉండిపోయాడు. దీంతో అతడ్ని ఎక్కడికి తరలించాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది.