నెహ్రూ జూ పార్క్, జోగులాంబ ఆలయంలో ఆన్లైన్ సేవలు... ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్క్ కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్ ను అటవీ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.

First Published Feb 13, 2023, 1:45 PM IST | Last Updated Feb 13, 2023, 1:45 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్క్ కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్ ను అటవీ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జూ పార్క్ కు వచ్చి టికెట్లు బుక్ చేసుకునే అవసరం లేకుండా ఈ మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని జూ అధికారులు తెలిపారు. జూ ఎంట్రీ టికెట్స్, బ్యాటరీ వెహికిల్స్ బుకింగ్ ఆన్లైన్ లోనే చేసుకునేలా మొబైల్ యాప్, జూ వివరాలకు సంబంధించిన వెబ్ సైట్ ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా రూపొందించినట్లు తెలిపారు.  ఇదిలావుంటే జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్ సైట్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే అమ్మవారిని సేవించుకునే సదవకాశాన్ని ఆన్ లైన్ ద్వారా పొందేలా మొబైల్ యాప్ ను రూపొందించారు.