కేటీఆర్ బర్త్ డే నాడు జోరుగా పార్టీ ఇచ్చిన కౌన్సిలర్.. కరోనా పాజిటివ్ గా నిర్థారణ..

సిరిసిల్ల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు, కౌన్సిలర్లను కరోనా భయం వెంటాడుతోంది. 

First Published Jul 31, 2020, 6:15 PM IST | Last Updated Jul 31, 2020, 6:15 PM IST

సిరిసిల్ల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు, కౌన్సిలర్లను కరోనా భయం వెంటాడుతోంది. గత 24న జరిగిన కేటిఆర్ జన్మదిన వేడుకలను ఓ కౌన్సిలర్ కేక్ కట్ చేసి జరిపాడు. అనంతరం పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చాడు. ఈ పార్టీకి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. అయితే తాజాగా, దావత్ ఇచ్చిన ఆ కౌన్సిలరుకు కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఈ పార్టీకి హాజరైనా నాయకుల్లో గుబులు మొదలయ్యింది. అతనితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్ కావాల్సిందిగా వైద్యులు తెలిపారు. ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ అయ్యారు.