పార్టీ జెండాను కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోండి: మరోసారి ఈటల సంచలనం
కరీంనగర్: ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు...
కరీంనగర్: ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు...కులం, డబ్బు, పార్టీ జెండా కాదు మనిషిని గుర్తుపెట్టుకోండి అంటూ మరోసారి మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదిక క్లస్టర్ ను ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.''నేను ఇబ్బంది పడుతూ ఉండొచ్చు గాక నేను గాయపడుతుండచ్చు గాక. కానీ నేను మనసును మార్చుకోలేదు పెట్టిన చెయ్యి ఆగదు చేసే మనిషిని నేను ఆగను. నేను ఉన్నంతవరకు 20ఏళ్ల ప్రస్థానంలో నన్ను గొప్పగా ఎంత ఎత్తుకు ఎత్తారో నాకు తెలుసు. తప్పకుండా నేను ఉన్నంతవరకు మావాళ్లు ఉన్నంతవరకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను'' అని ఈటల భరోసా ఇచ్చారు.