కేటీఆర్ సార్.. మా అన్నను బతికించండి.. చెల్లి విజ్ఞప్తికి కదిలిన మంత్రి..
రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఓ చెల్లి తన అన్నను కాపాడమంటూ వేడుకుంది
రాష్ట్ర మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో ఓ చెల్లి తన అన్నను కాపాడమంటూ వేడుకుంది. కేటీఆర్ సార్ మీరే దిక్కు.. మా అన్న ఆరోగ్యం సీరియస్ గా ఉంది.. సహాయం చేయండి అంటూ ప్లకార్టులు ప్రదర్శించింది. సంఘటన వివరాల్లోకి వెలితే. వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన పోచయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సిరిసిల్ల పెద్ద దవాఖానకు అన్నను తీసుకొని వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతోంది. విషయం తెలిసిన కేటీఆర్ ఆమెను పిలిచి మాట్లాడారు. కిడ్నీ వ్యాధి నయం చేయడానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రక్షా బంధన్ రోజు జరిగిన ఈ ఘటన పలువురిని కదిలించింది