వేములవాడ ఆలయంలో కరోనా అలర్ట్...

రాజన్న సిరిసిల్లా జిల్లా,  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు కరోనా వైరస్ కు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

First Published Mar 18, 2020, 4:50 PM IST | Last Updated Mar 18, 2020, 4:50 PM IST

రాజన్న సిరిసిల్లా జిల్లా,  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు కరోనా వైరస్ కు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ధర్మగుండం లోనికి పోకుండా గేట్లకు తాళాలు వేశారు. నాన్ కాంటాక్ట్ డిజిటల్ ధర్మామీటర్ తో భక్తులను పరీక్షిస్తున్నారు.సిబ్బందికి, ఉద్యోగులకు మాస్కులు, గ్లౌజులు అందజేశారు. ఆలయ ఈవో కృష్ణవేణి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.