హుస్సేన్ సాగర్ నీటి అందాల చాటున... విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న సచివాలయం
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతోంది.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతోంది. మరో వారంరోజుల్లో(పిబ్రవరి 17) ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. దీంతో గత రెండుమూడు నెలలుగా నిర్మాణపనులు శరవేగంగా సాగి దాదాపుగా పూర్తయ్యాయి. దీంతో సరికొత్త అందాలతో సచివాలయం వెలిగిపోతోంది. తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనాన్నినిర్మించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2019 జూన్ 27న కొత్త సచివాలయ నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆరు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అనుకున్నట్లుగానే నూతన సచివాలయాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది కేసీఆర్ సర్కార్. హుస్సేస్ సాగర్ నీటిఅందాల మధ్య మరింద అందంగా రూపుదిద్దుకున్న సచివాలయం హైదరాబాద్ కు మరో మణిహారంగా మారింది.