Asianet News TeluguAsianet News Telugu

నిమ్స్ హాస్పిటల్లో నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్... కేసీఆర్ సర్కార్ పై ప్రశంసలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వైద్యసదుపాయాల గురించి తెలుసుకునేందుకు నెదర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వైద్యసదుపాయాల గురించి తెలుసుకునేందుకు నెదర్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. ప్రతినిధి బృందంతో కలిసి హైదరాబాద్ నిమ్స్ కు చేరుకున్న నెదర్లాండ్ మంత్రికి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికారు. హాస్పిటల్లోని డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను నెదర్లాండ్ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు బాగున్నాయని నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్ ప్రశంసించారు. నిమ్స్ హాస్పిటల్ గురించి చాలా విన్నానని... అందుకే స్వయంగా చూడడానికి వచ్చానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం అందిస్తున్న పథకాలు, వైద్యసేవల గురించి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్ జాన్ కైపర్స్.