కారును పోలిన రోడ్డురోలర్ ... మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు గుర్తుల గుబులు

ఢిల్లీ : అధికార టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఎక్కడ నష్టం చేస్తాయోనన్న గుబులు పట్టుకుంది.

First Published Oct 19, 2022, 10:21 AM IST | Last Updated Oct 19, 2022, 10:21 AM IST

ఢిల్లీ : అధికార టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఎక్కడ నష్టం చేస్తాయోనన్న గుబులు పట్టుకుంది. గత ఉపఎన్నికల అనుభవాల దృష్ట్యా కారు గుర్తును పోలిన ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. అక్కడా ప్రయత్నాలు పలించక చివరకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, అడషనల్ అడ్వకేట్ జనరల్ రాంచదర్ రావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మునుగోడు ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తుపై అభ్యంతరం వ్యక్తం చేసారు. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తుతో తమ పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయని... వెంటనే ఆ గుర్తును రద్దు చేయాాలని విజ్ఞప్తి చేసారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా తమకు నచ్చిన పార్టీకి ఓటేసేలా చూడాలని సీఈసీని కోరారు టీఆర్ఎస్ ప్రతినిధులు.