కేంద్ర మంత్రిని వదలని పోలీసులు... మునుగోడు వెళుతుండగా కిషన్ రెడ్డిని అడ్డుకుని...
నల్గొండ : ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకుని మునుగోడు ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.
నల్గొండ : ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకుని మునుగోడు ఉపఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. ఈ క్రమంలో మునుగోడు నియోజకవర్గం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి సామాన్యుల వాహనాలే కాదు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేల కార్లు, కాన్వాయ్ లను వదిలిపెట్టడం లేదు. మునుగోడులోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసాకే వదిలిపెడుతున్నారు. ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాహనాన్ని కూడా నిలిపిన పోలీసులు సోదాచేసారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి మునుగోడులో ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి మునుగోడు వెళుతుండగా రేతిపల్లి చెక్ పోస్ట్ వద్ద మంత్రి వాహనశ్రేణిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి కారుతో పాటు కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేసాకే పంపించారు. తమ విధులను నిర్వహిస్తున్న పోలీసులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరించారు.