మునుగోడు ప్లోరైడ్ బాధితుడి ఇంటికి కేటీఆర్ ... ఆకలిగా వుందంటూ అడిగి మరీ భోజనం

నల్గొండ : ఐటీ మంత్రి కేటీఆర్ సాధారణంగానే బిజీగా వుంటారు...

First Published Oct 14, 2022, 11:28 AM IST | Last Updated Oct 14, 2022, 11:28 AM IST

 
నల్గొండ : ఐటీ మంత్రి కేటీఆర్ సాధారణంగానే బిజీగా వుంటారు... ఇక మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఆయన మరింత బిజీగా గడిపారు. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ అతి సామాన్య ప్లోరైడ్ బాధితుడికి సమయం కేటాయించి మంచిమనసు చాటుకున్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం నేరుగా మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం లోని ప్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి వెళ్ళారు కేటీఆర్. తనకు గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి... ఇప్పుడు అదే ఇంటికి స్వయంగా వచ్చిన కేటీఆర్ ను చూసిన స్వామి ఆనందం మాటల్లో చెప్పలేం.  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేటీఆర్ సడన్ గా అంశాల స్వామి ఇంటికి వెళ్ళారు. స్వామితో పాటే నేలపై కూర్చుని కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాగా ఆకలిగా వుందంటూ అడిగిమరీ భోంచేసారు. ఈ సమయంలో స్వయంగా మంత్రే స్వామికి వడ్డించారు. పచ్చిపులుసు, పప్పుచారు చాలా ఇష్టంగా తిన్న కేటీఆర్ చాలా బాగున్నాయన్నారు. అనంతరం స్వామి సొదరి దంపతులకు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు. ఇలా ప్లోరైడ్ బాధితుడి ఇంట్లో పండగ వాతావరణాన్ని సృష్టించారు మంత్రి కేటీఆర్.