కరీంనగర్ లో భానుడి భగభగలు... మంటలు చెలరేగి నడిరోడ్డుపైనే కారు దగ్దం
కరీంనగర్: ఇటీవల వర్షాలతో కాస్త చల్లబడ్డ వాతావరణ మళ్లీ భానుడి భగభగలతో మళ్లీ వేడెక్కింది. ఈ ఎండలే కారణమో లేక సాంకేతిక కారణాలో తెలీదు గానీ నడిరోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
రీంనగర్: ఇటీవల వర్షాలతో కాస్త చల్లబడ్డ వాతావరణ మళ్లీ భానుడి భగభగలతో మళ్లీ వేడెక్కింది. ఈ ఎండలే కారణమో లేక సాంకేతిక కారణాలో తెలీదు గానీ నడిరోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మానకోండుర్ మండలం ఉటూర్ గ్రామ సమీపంలో రోడ్డుపై వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి కారులోని ముగ్గురు ప్రయాణికులు కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో మెళ్లిగా ప్రారంభమైన మంటలు అంతకంతకూ పెరుగుతూ కారుమొత్తాన్ని వ్యాపించాయి. కళ్లముందే కారు దగ్దతమవుతున్నా ఎవ్వరూ ఏం చేయలేక పోయారు. మంటల్లో కారు పూర్తిగా దగ్దమయ్యింది.