Asianet News TeluguAsianet News Telugu

పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ... మొక్కలునాటిన సోనూ సూద్, శ్రీలీల

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా మొక్కల పెంపకాన్ని చేపట్టింది. హరిత హారం, పల్లె ప్రకృతి వనాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఇలా కేవలం చెట్ల పెంపకం కోసమే ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందింది.

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా మొక్కల పెంపకాన్ని చేపట్టింది. హరిత హారం, పల్లె ప్రకృతి వనాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్... ఇలా కేవలం చెట్ల పెంపకం కోసమే ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందింది. అంతేకాదు సీనీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులతో మొక్కలను నాటించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే చర్యలు చేపడుతోంది కేసీఆర్ సర్కార్. ఇందులోభాగంగా తాజాగా సినీనటుడు సోనూ సూద్, హీరోయిన్ శ్రీలీల కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

నటుడు సోనూ సూద్ ఇవాళ నేచర్ క్యూర్ హాస్పిటల్ లో కొత్తగా ఏర్పాటుచేసిన కాటేజులు, భోజన శాల, యోగా ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన ద్వారం వద్ద సంపంగి మొక్కను నాటారు. ఇక ఇటీవల మంచి హిట్ అందుకున్న హీరోయిన్ శ్రీలీల కూడా మొక్కలు నాటారు.  గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా గచ్చిబౌలి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలిటీ (NITHM)లో శ్రీలీల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని శ్రీలీలకు అందజేసారు. 

Video Top Stories