ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రభుత్వ విప్ బాధ్యతలు... జమ్మికుంటలో సంబరాలు

కరీంనగర్ : తెలంగాణ శాసన మండలంలో ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియమితులవడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. 

First Published Feb 13, 2023, 11:33 AM IST | Last Updated Feb 13, 2023, 11:33 AM IST

కరీంనగర్ : తెలంగాణ శాసన మండలంలో ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియమితులవడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టపాసులు కాల్చారు. అలాగే మిఠాయిలు పంచుకుని నోరు తీపి చేసుకున్నారు. ఈ 
సందర్భంగా రాజేశ్వరావు మాట్లాడుతూ... కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, ఇప్పుడు ప్రభుత్వ విప్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.