Asianet News TeluguAsianet News Telugu

తాటి, ఈత చెట్ల తొలగింపుపై మానవ హక్కుల కమిషన్ కు.. జీవన్ రెడ్డి..

జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె వద్ద  కాళేశ్వరం లింక్ -2 పంపు హౌస్ పనుల్లో భాగంగా తొలగించిన తాటి, ఈత చెట్లను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. 

జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె వద్ద  కాళేశ్వరం లింక్ -2 పంపు హౌస్ పనుల్లో భాగంగా తొలగించిన తాటి, ఈత చెట్లను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. కమీషన్ల కోసమే  ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని మండిపడ్డారు. కొండపోచమ్మ ప్రారంభ ఆర్భాటం కోసమే ఎల్లంపల్లి నీటిని తరలించారన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసేందుకే కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని, పంపు హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. మేఘ కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. పెద్దవాగులో తాటి,ఈత చెట్ల తొలగింపుపై మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు.