మంథనిలోని తన ఇంట్లోనే దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు..
మంథనిలోని తన నివాసంలో బైఠాయించి దీక్ష చేపట్టిన మాజీమంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
మంథనిలోని తన నివాసంలో బైఠాయించి దీక్ష చేపట్టిన మాజీమంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. గోదావరినది పై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జలదీక్ష కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. పెద్దపెల్లి జిల్లా మంథని లో ఉదయం 4 గంటల నుంచి శ్రీధర్ బాబు ఇంటి ముందు పోలీసులు మోహరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లంపల్లి, కాళేశ్వర ముక్తీశ్వర ప్రాజెక్ట్ ల వద్ద జలదీక్షకు శ్రీధర్ బాబు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.