లోతట్టు ప్రాంతాలలో మునిగిన ఇండ్లకు తక్షణమే ప్రభుత్వం సాయం చేయాలి.....ఎమ్మెల్లే ఈటెల

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ,  అంబేద్కర్ కాలనీ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. 

First Published Jul 29, 2023, 3:47 PM IST | Last Updated Jul 29, 2023, 3:47 PM IST

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ,  అంబేద్కర్ కాలనీ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. బిజేపి పార్టి ఎన్నికల ఛైర్మన్, హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. అదైర్య పడవద్దని బరోసా కల్పించారు. బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సంపత్ రావు, పట్టణ అధ్యక్షుడు మల్లేష్,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.