అధికారుల నిర్లక్ష్యం.. జలపాతాన్ని తలపిస్తున్న వాటర్ ట్యాంక్...
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లీకై గత కొన్ని రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లీకై గత కొన్ని రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు అందించడానికి రెండేళ్ల కిందట 27 లక్షలతో ఈ ట్యాంకు నిర్మించారు. ఇప్పటికీ హుస్నాబాద్ పట్టణంలో కేవలం రెండు నుంచి నాలుగు వార్డులలో మాత్రమే మిషన్ భగీరథ నీరు వస్తున్నాయన్నారు. ట్యాంక్ నుండి నీరు లీకై కింద నిల్వగా ఉండడం వలన బేస్ మెంట్ బెడ్ కూలిపోయిందని, లీకేజ్ అవుతున్న ఈ వాటర్ ట్యాంక్ మున్సిపల్ కార్యాలయనికి 300మీటర్లు ఎంపీడీఓ కార్యాలయనికి 100 మీటర్ల దూరంలో ఉందన్నారు. వారం రోజులుగా లీకేజీ జరుగుతున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారన్నారు.