పాతబస్తీలో యువకుల వీరంగం... హాస్పిటల్లోకి చొరబడి డాక్టర్లు, సిబ్బందిపై దాడి
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో కొందరు యువకులు రెచ్చిపోయారు.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. వాహనాల పార్కింగ్ విషయంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందితో ఘర్షణకు దిగిన యువకులు చివరకు డాక్టర్లపైనా దాడికి దిగారు. ఈ ఘటన లాల్ దర్వాజా లోని ఎస్సెల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. యువకులు దాడికి పాల్పడిన దృశ్యాలు హాస్పిటల్లోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఒక్కసారిగా హాస్పిటల్లోకి చొరబడ్డ యువకులు పర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు రిసెప్షన్ లోని సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిని అడ్డుకోడానికి డాక్టర్లు, ఇతర సిబ్బంది ప్రయత్నించగా వారిపైనా దాడిచేసారు. ఇలా 8మంది హాస్పిటల్ సిబ్బందిపై యువకుడు దాడికి తెగబడ్డారు. అంతేకాదు అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులు, గర్బిణి మహిళలు హాస్పిటల్లోకి రాకుండా అడ్డుగా కారు పెట్టి హంగామా సృష్టించారు. హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.