Asianet News TeluguAsianet News Telugu

నిర్మల్ మైనర్ బాలిక అత్యాచారం... టీఆర్ఎస్ పార్టీనుండి సాజిద్ సస్పెండ్

నిర్మల్:  మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్ ను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. సాజిద్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు... ఇప్పటినుండే ఈ సస్పెన్షన్ అమల్లోకి రానున్నట్లు మంత్రి తెలిపారు. మైనర్ పై అత్యాచారం అత్యంత హేయమైన చర్య... టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బాధిత బాలికకు కూడా తగిన న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి తెలిపారు. అత్యాచారంపై ఫిర్యాదు అందించవెంటనే పోలీసులు వెంటనే సాజిద్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో వుందని మంత్రి ఇద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. 
 
Video Top Stories